హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కానీ, ప్రస్తుతం రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటిస్తుంది నిధి. వీటిలో ఒకటి పవన్ కల్యాణ్ సరసన ‘హరిహరవీరమల్లు’ కాగా.. మరోవైపు ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘రాజాసాబ్’.
Also Read: Saiyami Kher : టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు ..!
అయితే ఇక ఈ రెండు ప్రాజెక్టులపై పూర్తి ఆశలు పెట్టుకున్న నిధి అగర్వాల్‌కు వరుస వాయిదాలు నిరాశనే మిగులుస్తూ వస్తున్నాయి. కానీ ‘హరిహరవీరమల్లు’ రీషెడ్యూల్ చేయడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. ఫైనల్‌గా నిధి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. మే 21న అంటే ఈ రోజు కొత్త పాట లాంచ్‌తో ప్రమోషన్స్ ఊపందుకోనున్నాయి. దీంతో కాగా నిధి అగర్వాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉండి ప్రమోషన్స్‌పైనే ఫోకస్ పెట్టినట్టు టాక్. ‘హరిహరవీమల్లు’ నాలుగేళ్లుగా సెట్స్‌పై కొనసాగుతుండగా.. మొత్తానికి ఇన్నాళ్ల తర్వాత తమ అభిమాన నటి నిధి అగర్వాల్ మళ్లీ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతుండటంతో అభిమానులు, ఫాలోవర్లు అంతా కూడా ఆనందం వ్యాక్తం చేస్తున్నారు.