Janhvi Kapoor: బాయ్‌ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిన జాన్వీ.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor Again Caught With Boyfriend Shikhar Pahariya: బాలీవుడ్‌కి చెందిన సినీ తారలు తమ కెరీర్ పరంగా కన్నా.. వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. అందునా.. డేటింగ్ వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి. అఫీషియల్‌గా తమ రిలేషన్‌షిప్‌పై నోరు మెదపరు కానీ.. వెకేషన్లకు, పార్టీలకు మాత్రం బాగా చక్కర్లు కొడుతుంటారు. మీడియాకి చిక్కకుండా సీక్రెట్‌గా తమ తతంగాల్ని కొనసాగించాలని ప్రయత్నిస్తారు. కానీ.. సెలెబ్రిటీలకు మీడియా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక సమయంలో అడ్డంగా దొరికిపోతారు. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా అలాగే బుక్కైపోయింది. గతంలోనూ ఓసారి తన ప్రియుడితో కలిసి దొరికిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కెమెరాకి చిక్కింది.
Aishwarya Rajinikanth: ఐశ్వర్య పిసినారి.. జీతం పెంచలేదు.. అందుకే దొంగతనం
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్‌లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇంతకీ.. జాన్వీ ప్రియుడు ఎవరో తెలుసా? మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహరియా. రాజకీయ నేపథ్యం కలిగి ఉండటంతో పాటు చూడ్డానికి చాలా బాగుంటాడు కాబట్టి.. జాన్వీ అతని ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. గతంలో ఓసారి వీళ్లు కారులో షికారు చేస్తూ.. మీడియాకు దొరికారు. అప్పుడే వీరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే ప్రచారం మొదలైంది. అయితే.. ఆ ఇద్దరు మాత్రం ఈ ప్రచారంపై నోరు మెదపలేదు. ఇప్పుడు వీళ్లిద్దరు ముంబైలోని కలినా ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. ఇద్దరూ వైట్‌డ్రెస్‌లో ట్విన్నింగ్ అవుట్‌ఫిట్‌లో కనిపించారు. అయితే.. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చాక వీళ్లిద్దరు తెలివి ప్రదర్శించారు. జంటగా కనిపిస్తే హంగామా అవుతుందని భావించి.. వేర్వేరుగా బయటకొచ్చి, వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి.. అధికారికంగా ప్రకటించకపోయినా, వీళ్లు ప్రేమలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.
Variety Thief : వేసిన తాళం వేసినట్లే ఉంది.. రూ.13వేలు పోయాయి.. ఎలుకపైనే అనుమానం
కాగా.. బాలీవుడ్‌లో జాన్వీకి చెప్పుకోదగ్గ విజయాలు పడలేదు కానీ, కెరీర్ మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాఫీగానే సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్నా.. ఛాన్సులు మాత్రం వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ అమ్మడు జూ.ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్30 సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఒకవేళ ఈ సినిమాతో జాన్వీ ఆకట్టుకుంటే మాత్రం.. ఆమె కెరీర్ మలుపు తిరగడం ఖాయం. తన తల్లి శ్రీదేవి రేంజ్‌లో కాకపోయినా.. వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అవ్వొచ్చు.
తాజావార్తలు
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?