Janasena Supporters Felicitates TG Vishwa Prasad in USA: విభిన్న తరహా సినిమాలు రూపొందించి పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నిర్మాత టిజి విశ్వ ప్రసాద్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా అందరికీ చెప్పాల్సిన పని లేదు. సినిమాల పరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్‌తో టిజి విశ్వ ప్రసాద్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్‌కు పరిశ్రమలో బహిరంగంగా మద్దతునిచ్చిన చాలా తక్కువ మందిలో ఆయన కూడా ఒకరు. NDA కూటమి విజయాన్ని కూడా ఆయన సినిమా ఈవెంట్ తరహాలో సంబరాలు జరిపారు.
Rashmi: వాళ్ళు మేజర్లలా రేప్ చేస్తే మైనర్లు అంటారేంటి.. వాళ్ళని వదలద్ధంటున్న రష్మీ
నిజానికి పవన్ కళ్యాణ్‌తో పాటు టీజీ విశ్వ ప్రసాద్ 2024 ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారని చెబుతారు. ఇటీవల ఉపముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయన పవన్ ను కలిసి వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా అమెరికాలోని సియాటిల్‌కు వచ్చిన టీజీ విశ్వప్రసాద్‌కు విమానాశ్రయంలో జనసేన మద్దతుదారులు ఘన స్వాగతం పలకడం గమనార్హం. అంతేకాదు సియాటిల్‌లోని శ్రీదేవి ఫంక్షన్ హాల్‌లో ఆయనను జనసైనికులు ఘనంగా సత్కరించారు. ఇక ఈ సందర్భంగా విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..‘పటిష్టమైన సమన్వయం వల్ల కూటమి ఎన్నికల్లో విజయం సాధించిందిని, తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు ఒకే స్ఫూర్తితో, ఆత్మీయతతో కలిసి పనిచేయాలని అన్నారు.