Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్.. జనసేన నేతకు పవన్ షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారంలో జనసేన కీలక నేత, రాజమండ్రి పార్టీ ఇన్చార్జ్ అను శ్రీ సత్యనారాయణ అలియాస్ అత్తి సత్యనారాయణ మీద జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున, జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని, అలాగే మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read:Pushpa: పుష్పలో నారా రోహిత్.. కానీ?
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నట్లు జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేరుతో ఒక లెటర్ హెడ్ మీద లేఖ రిలీజ్ చేశారు. దీనిని జనసేన పార్టీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి షేర్ చేశారు. అత్తి సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లాలో అనుశ్రీ ఫిల్మ్స్ పేరుతో సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ చేయాలని మొట్టమొదట పిలుపునిచ్చింది ఆయనేనని ప్రచారం జరుగుతోంది.
Also Read: Pawan Kalyan: సినిమా హాళ్ల బంద్ వెనుక ఉన్న శక్తులేమిటో?
ఈ మేరకు నిన్న దిల్ రాజు కూడా తన ప్రెస్ మీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన జనసేన కీలక నేత అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు కీలకమైన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ థియేటర్ల బంద్ వ్యవహారం వెనక జనసేన నేత ఉన్నా ఏమాత్రం వెనకాడాల్సిన పనిలేదని, చర్యలు తీసుకోవాలని పవన్ తేల్చి చెప్పారు. ఆ కాసేపటికి పార్టీ నుంచి ఆయనను తొలగిస్తున్నట్లు ప్రకటన రావడం గమనార్హం.
శ్రీ అత్తి సత్యనారాయణ మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా? అసత్యమా? అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించడమైనది. pic.twitter.com/zSsXAwPLQM
— JanaSena Party (@JanaSenaParty) May 27, 2025
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!