ఇవాళ రాజమండ్రిలో మీడియా ముందుకు జనసేన నుంచి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ అలియాస్ అనుశ్రీ ఫిలిమ్స్ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. థియేటర్ల బంద్ కు సూత్రధారి అత్తి సత్యనారాయణ అంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన వివరణ ఇచ్చారు. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. దురుద్దేశంతోనే దిల్ రాజు నా పేరు చెప్పారు.. పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడంతో దిల్ రాజు జనసేన పేరు ఎత్తారని అన్నారు. Also…
తెలుగు రాష్ట్రాల థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారంలో జనసేన కీలక నేత, రాజమండ్రి పార్టీ ఇన్చార్జ్ అను శ్రీ సత్యనారాయణ అలియాస్ అత్తి సత్యనారాయణ మీద జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున, జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని, అలాగే మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు. Also Read:Pushpa: పుష్పలో నారా…