Jagapathi Babu: ‘పెద్ది’ లో ‘పెద్దాయన’ పని అయిపోయింది.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన అప్పలసూరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagapathi Babu: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీలో కీలకమైన ‘అప్పలసూరి’ పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు జగపతి బాబు తన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఒక ఇంటెన్స్ డబ్బింగ్ వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది.
జగ్గు భాయ్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అప్పలసూరి పాత్ర కోసం ఆయన డబ్బింగ్ చెబుతూ చూపించిన హావభావాలు, పలికిన భావోద్వేగ డైలాగులు థియేటర్లలో ఏ రేంజ్ రచ్చ ఉండబోతుందో హింట్ ఇస్తున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. డబ్బింగ్లో జగ్గు భాయ్ చూపించిన ఇంటెన్సిటీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. “అప్పలసూరి క్యారెక్టర్ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మేకర్స్ గతంలో ఈ సినిమాలో జగపతి బాబు పోషిస్తున్న ‘అప్పలసూరి’ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఆ లుక్ ఎంత వైరల్ అయిందో తెలిసిన విషయమే. నిజానికి ఎప్పుడూ స్టైలిష్ విలన్‌గానో లేదా క్లాస్ తండ్రి పాత్రల్లోనో కనిపించే జగపతి బాబు, ఈ సినిమాలో ఊహించని మేకోవర్‌తో ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో ఒక రా అండ్ ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించారు. తాజాగా ఆయన ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Also Read
- Over Your Dead Body: ఈ భార్యాభర్తల కన్నింగ్ ప్లాన్‌కు బుర్రపాడు... మెంటలెక్కించే ట్విస్టులు మావా
- Warrant on ZEE5: నేరస్తులకు చుక్కలు చూపించే కానిస్టేబుల్... ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్
- Thaman - Anirudh: చేతులు కలిపిన సౌత్ సెన్సేషన్స్.. థమన్ మ్యూజిక్‌లో అనిరుధ్ ఊరమాస్ సాంగ్!
- Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
#PEDDI ki ankitham ayyipoyina #Appalasoori. pic.twitter.com/mrVrKEG5HA
— Jaggu Bhai (@IamJagguBhai) May 26, 2026
తాజావార్తలు
-
Jagapathi Babu: ‘పెద్ది’ లో ‘పెద్దాయన’ పని అయిపోయింది.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన అప్పలసూరి!
-
Summer Health : ఎండకాలంలో లీచీ పండు తింటే ఏమవుతుందో తెలుసా..? అమృతం అనుకుంటే ప్రమాదమే.!
-
Suvendu Adhikari: ‘‘పారిపోండి, మీకు తిండి దండగ’’.. బంగ్లాదేశీయులకు బెంగాల్ సీఎం వార్నింగ్..
-
CM Vijay: రేపు ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధాని మోడీతో సమావేశం
-
Iran: తాజ్ మహల్ చరిత్ర తెలిస్తే అక్కడికి వెళ్లేవాడే కాదు.. మార్కోరూబియోపై ఇరాన్ సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!