బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఈ బ్యూటీకి నార్త్ తో పాటు సౌత్ లోనూ బాగానే అభిమానులు ఉన్నారు. ఇటీవలే బాద్షా సాంగ్ “పానీ పానీ” అంటూ జాక్వెలిన్ ఆడిపాడిన సాంగ్ విడుదలైంది. ఇప్పుడు ఈ అమ్మడు బాయ్ ఫ్రెండ్ తో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం విషయమై వార్తల్లో నిలిచింది. కాగా ప్రస్తుతం ఆమె “రామ్ సేతు”లో అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తోంది.
Read Also : ప్రియమైన లోదుస్తుల బ్రాండ్ కి… ఇక పై ప్రియాంక మాట సాయం!
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న “బచ్చన్ పాండే” అనే మరో చిత్రంలో కూడా జాక్వెలిన్ కనిపించనుంది. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి సనన్ కూడా నటిస్తోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటిస్తున్న యాక్షన్ మూవీ “కిక్ 2″లో కూడా భాగం కానుంది. జాక్వెలిన్ ప్రస్తుతం హర్రర్-కామెడీ “భూత్ పోలీస్” విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, యామి గౌతమ్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇలా వరుస సినిమాతో బిజీగా ఉన్న జాక్వెలిన్ తాజాగా తన పోల్ డ్యాన్స్ వీడియోతో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఆ వీడియోలో జాక్వెలిన్ కు పోల్ డ్యాన్స్ పై ఉన్న పట్టు, నైపుణ్యం కన్పిస్తున్నాయి. చాలా కాలం తరువాత జాక్వెలిన్ ఇలా పోల్ డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.