Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా సరైన గుర్తింపు దక్కక ఎందరో నటీనటులు తెరవెనుకే ఉండిపోతారు. ఒకసారి ఒక ముద్ర పడితే దాని నుంచి బయటపడటం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా ఇలాంటి తీవ్ర ఆవేదననే ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు ప్రముఖ కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ కొమరం. దాదాపు 18 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలను, తన జీవితాన్ని మార్చిన ‘నాగులు’ పాత్ర వెనుక ఉన్న సంఘర్షణను వివరిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వేదికపై మైక్ అందుకున్న కొమరం మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు దాటింది. గత 12 ఏళ్లుగా కేవలం ‘కొమురక్క’ అనే లేడీ గెటప్‌కే పరిమితం చేశారు. అందరూ నన్ను కేవలం ఆ గెటప్‌తోనే చూసి గేలి చేశారు. నాతో ఒకే రూమ్‌లో ఉన్నవాళ్లు, నా స్నేహితులు సుమారు 15 మంది దర్శకులుగా ఎదిగారు. వాళ్లెవ్వరికీ నాలో ఉన్న నటుడు గుర్తుకు రాలేదు, కనీసం ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వాలని ఆలోచించలేదు” అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఎలాంటి పరిచయం లేకపోయినా దర్శకుడు శివ నిర్వాణ తనపై నమ్మకం ఉంచి ‘నాగులు’ అనే కీలక పాత్ర ఇచ్చారని కొమరం కొనియాడారు. “మొదట లేడీ గెటప్ అన్నప్పుడు ఏదో సాధారణ పాత్ర అనుకున్నా, కానీ రవితేజ సార్ కాలర్ పట్టుకుని కొట్టే సన్నివేశం ఉందని చెప్పినప్పుడు భయంతో చెమటలు పట్టాయి. అసలు ఫైట్లు చేయని నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ ఒక్క పాత్రతో నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘నాగులు’ అంటూ పిలుస్తున్నారు, ఇప్పటికే ఏడెనిమిది ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. నా భార్య, పిల్లల కళ్లల్లో ఎన్నడూ చూడని సంతోషం కనిపిస్తోంది” అని కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
మాస్ మహారాజా రవితేజ వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ.. “ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉంటారు, అందరికీ వేర్వేరు అభిమానులు ఉంటారు. కానీ హీరోల అభిమానులందరూ ఇష్టపడే ఏకైక హీరో రవితేజ సార్. ఫైట్ సీన్లలో నన్ను ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నారు. దెబ్బలు తగిలినా నా నటనకు ఇబ్బంది కలగకూడదని ఎంతో సహకరించారు. ఆయన కంఫర్ట్ వల్లే ఈ పాత్ర ఇంత బలంగా వచ్చింది” అని పేర్కొన్నారు. ‘ఒసేయ్ రాములమ్మ’ తర్వాత మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, కుటుంబాలు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్న పరిస్థితి ‘ఇరుముడి’ ద్వారా కనిపిస్తోందని, ఈ చిత్ర విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ కొమరం తన ప్రసంగాన్ని ముగించారు.
తాజావార్తలు
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!