యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. కొంతకాలం క్రితం కరోనా కారణంగా షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది చిత్రబృందం. కానీ ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో మళ్ళీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసి తక్కువ వ్యవధిలోనే ఫైనల్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ‘మాస్ట్రో’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
Also Read : సినీ ప్రియులకు గుడ్ న్యూస్!
ఇక ఇది నితిన్ కు 30వ మూవీ కాగా… హిందీ చిత్రం ‘అంధాధూన్’కు తెలుగు రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటిస్తోంది. ఈ చిత్రంలో జిష్షుసేన్ గుప్తా ఒక ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నారు.