‘పిప్పా’… ఇషాన్ కట్టర్, మృణాళ్ ఠాకుర్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కబోతోన్న వార్ మూవీ. 1971 ఇండొ-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్రిగేడియర్ బల్ రామ్ సింగ్ మెహతాగా హీరో ఇషాన్ కట్టర్ నటించనున్నాడు. భారత తూర్పు సరిహద్దులో పాక్ సైన్యంతో జరిగిన 48 గంటల సుదీర్ఘ యుద్ధమే ‘పిప్పా’ సినిమాలోని కీలకమైన కథ. ఇండియా విజయానికి ఆ యుద్ధమే బీజాలు వేసింది. అలాగే, బ్రిగేడియర్ బల్ రామ్ మెహతా యువ రక్తంతో బీకర యుద్ధ రంగంలో తన జవాన్లని మున్ముందుకు ఉరికించాడు. ఆ ఉత్సాహవంతమైన దేశభక్తి ఘట్టానికి వెండితెర రూపమే ‘పిప్పా’!
Read Also : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీక్షకులకు ఇక పండగే పండగ!
అద్భుతమైన కథతో, ప్రతిభావంతులైన నటీనటులతో మార్చ్ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లాల్సింది ‘పిప్పా’ మూవీ. కానీ, రాజకృష్ణ మెనన్ దర్శకత్వంలో రూపొందాల్సిన వార్ మూవీ కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ఇషాన్ కట్టార్, మృణాళ్ ఠాకుర్ కెమెరా ముందుకు వెళ్లేందుకు సంసిద్దం అవుతున్నారు. సెప్టెంబర్ లో యాక్షన్ థ్రిల్లర్ పిక్చరైజేషన్ స్టార్ట్ అవుతుందని బాలీవుడ్ టాక్.
ఆర్ఎస్వీపీ, రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా తెరకెక్కుతోన్న ‘పిప్పా’ వచ్చే సంవత్సరం సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి…