టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా ఇతర హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నదే ఎక్కువ. కోలీవుడ్ లోనూ ఆమెది ఇదే పరిస్థితి.
Also Read : Tollywood : హీరోయిన్స్ నెగిటివ్ రోల్స్.. సినిమా కెరీర్ కిల్స్
పక్కా కమర్షియల్, థాంక్యూ ప్లాప్స్ తర్వాత టోటల్లీ కోలీవుడ్, బాలీవుడ్ పై ఫోకస్ చేసింది రాశీ ఖన్నా. తమిళ ఇండస్ట్రీలో తిరు, సర్దార్, ఆరణ్మనై4 హ్యాట్రిక్ హిట్స్ తో జోరు మీదున్న డిల్లీ డాళ్ కెరీర్ కు బ్రేకులేసింది అగత్యా ప్లాప్. ఇక బీటౌన్‌లో నటించిన ఓటీటీ సిరీస్ ఫర్జీ ఓకే అనుకున్నప్పటికీ యోధ, ద సబర్మతి రిపోర్ట్ గట్టి దెబ్బేశాయి కానీ త్రీ ఫిల్మ్స్ చేస్తోంది. ఇక తెలుగులో థాంక్యూ తర్వాత కనిపించని రాశీ రెండేళ్ల తర్వాత ‘తెలుసు కదా’తో పలకరించబోతోంది. చూస్తే ఇందులోనూ మరొక భామ శ్రీనిధి శెట్టితో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. శ్రీనిధి శెట్టితో పాటు రాశీ నటిస్తూన్న తెలుసు కదా అక్టోబర్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఇక తెలుగులో కెరీర్ క్లోజ్ అనుకుంటున్న టైంలో వచ్చిన ఆఫర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో పవన్ సరసన నటిస్తున్నానని సంతోష పడాలో శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వచ్చిందని ఫీల్ అవ్వాలో అర్థం కాని సిచ్యుయేషన్. మెగా హీరోతో జోడీ కట్టడం ఆమెకు కొత్త కాదు గతంలో మిడ్ రేంజ్ హీరోలు సాయి తేజ్ తో సుప్రీమ్, వరుణ్ తేజ్ తో తొలిప్రేమలో నటించింది అమ్మడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ తేరీ రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ తో ఫేట్ మారి ఇక నుండైనా టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొడుతుందేమో. సోలో హీరోయిన్‌గా ఎప్పుడు కనిపిస్తుందో లెట్స్ వెయిట్.