చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమా అభిమానులంతా ఇప్పుడు ఓటీటీలపైనే దృష్టి మరల్చారు. విశేషం ఏమంటే ఈ వారాంతం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ యేడాది బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ కు నామినేట్ అయిన ‘మినారి’ అమెరికన్ డ్రామ్. కొరియన్ లాంగ్వేజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. లీ ఇస్సాక్ చుంగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన యున్ యుహ్-జంగ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ గా ఆస్కార్ బహుమతిని గెలుచుకుంది.
ఇక సల్మాన్ ఖాన్ అభిమానులు ఎదురుచూస్తున్న తేదీ మే 13. ఆ రోజున సల్లూభాయ్ నటించిన ‘రాధే’ చిత్రం థియేటర్లలోనే కాకుండా జీ ప్లెక్స్ లోనూ విడుదల అవుతోంది. ఇందులోనూ డబ్బులు కట్టి ఆ మూవీని చూడొచ్చు. ఈ యాక్షన్ థిల్లర్ మూవీలో సల్మాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. మే 14న నెట్ ఫ్లిక్స్ లో హిండీ తెలుగు మూవీ ‘సినిమా బండీ’ స్ట్రీమింగ్ కాబోతోంది. పల్లెటూరిలోని కొందరు యువకులు సినిమా తీయడానికి చేసే ప్రయత్నాలను వినోద ప్రధానంగా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తెలుగువారైన రాజ్ అండ్ డీకే దీని దర్శక నిర్మాతలు. ఇక అమెజాన్ ప్రైమ్ లో మే 14న థనుష్ ‘కర్ణన్’ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. గత నెలలో థియేటర్లలో విడుదలై ఈ మూవీకి సాధారణ ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ఈ యాక్షన్ డ్రామాను మారి సెల్వరాజ్ తెరకెక్కించాడు. నెట్ ఫ్లిక్స్ లోనే 14వ తేదీ డచ్ మూవీ ‘ఫెర్రీ’ స్ట్రీమింగ్ అవుతోంది. నెదర్లాండ్ లోని డ్రగ్ దందా నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ లోనే పాపులర్ అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ రాయ్ హల్ స్టన్ ఫ్రోవిక్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘హాల్ స్టన్’ మినీ సీరిస్ ప్రసారం కాబోతోంది. ఈ సీరిస్ కు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుండే ఫిల్మ్ సర్కిల్స్ లో ఊహించని బజ్ క్రియేట్ అయ్యింది. మొత్తం మీద ఈ వారంతంలో ఓటీటీలో వీక్షకులకు సంపూర్ణ వినోదం దొరకబోతోందని అనుకోవచ్చు.