రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 12 ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ విజేత అవడం కోసం పవన్‌దీప్ రాజన్, మొహద్ డానిష్, నిహాల్ టౌరో, సాయిలీ కాంబ్లే, అరుణిత కంజిలాల్ తో పాటు తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియా పోటీపడుతున్నారు. ముగింపు దగ్గర అయ్యేకొద్ది ఈ సీజన్ విజేత ఎవరనేదానిపై హాగానాలు పెరిగిపోతున్నాయి. ఫైనల్ కి చేరుకున్న పోటీదారులందరికీ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఉత్తరాఖండ్ కు చెందిన పవన్ దీప్ రాజన్ ఈ సీజన్ విజేత అవుతాడంటూ పలువరు అంచనా వేస్తున్నారు. అద్భుతమైన స్వరం, ఆకట్టుకునే ప్రదర్శనతో పాటు తనదైన వ్యక్తిత్వంతో అందరిదృష్టిని తనవైపు తిప్పుకున్నాడు పవన్. అంతే కాదు అరుణిత కంజిలాల్‌తో ప్రేమ వ్యవహారం సైతం అతగాడిని వార్తల్లో నిలిపింది.
Read Also : విశ్వక్ సేన్ విడుదల చేసిన ‘మెరిసే మెరిసే’ ట్రైలర్
ఇటీవల ఈ షోకి ప్రత్యేక అతిథిగా వచ్చిన బప్పి లాహిరి పవన్‌దీప్ గానానికి మెచ్చి తన టేబుల్ ని బహుమతిగా ఇవ్వటం విశేషం. ‘కిసీ నజర్ కో తేరా’ పాటతో అంతలా ఇంప్రెస్ చేశాడు వపన్ దీప్. ఇక జడ్జి సోను కక్కర్ కూడా ఈ పోటీలో పవన్‌దీప్ విజేత కావాలని కోరుకుంటున్నట్ల చెప్పటం గమనార్హం. ఇదే విషయమై ఓ సోషల్ మీడియా వెబ్ సైడ్ సర్వే నిర్వహించింది. పవన్ దీప్ విజేతా నిలుస్తాడా లేదా? అని. అందులో 82% మంది అభిమానులు పవన్‌దీప్ ఇండియన్ ఐడల్ 12 ట్రోఫీ గెలుచుకుంటాడని…12% మంది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఆడియన్స్ కోరుకుంటున్నట్లు పవన్ విజేతగా నిలుస్తాడో లేదో చూద్దాం.