కార్తీ, అరవింద్ స్వామి ముఖ్య పాత్రల్లో వచ్చిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. ఇక్కడ హీరోగా అని ఎందుకు సంబోదించలేదంటే సినిమాలో వాళ్ళ నటించలేదు జీవించారు. సినిమా చేస్తున్నంత సేపు కార్తీ, అరవింద్ స్వామిలు హీరోలుగా కాకుండా మన కుటుంబ సభ్యులుగా అనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు.సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసారు .
Also Read : Srikanth Iyengar : క్షమాపణలు కావాలా.. అయితే వేచివుండండి
తాజగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. రిలీజ్ అయిన నాటి నుండి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ తెచ్చుకుంది సత్యం సుందరం. ఇలాంటి సినిమాలు ఎప్పుడంటే అప్పుడు రావు చాలా అరుదుగా మాత్రమే వస్తాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సుందరం పాత్రలో నటించిన కార్తీ అద్భుతంగా జీవించి ఇలాంటి మనిషి ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి అనిపించేంతగా ప్రతి ఒకరిని కదిలించింది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు మరిన్నిరావాలి. ఉద్యోగం, డబ్బు సంపాదనలో పడి మనుషులకు దూరంఅయ్యాం. మనుషులతో ప్రేమను పంచుకుని, నలుగురి ప్రేమ సాధించడమే నిజమైన ఆస్థి అని తెలియజేసిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ను అభినందిస్తున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.