Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Talpade: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ కింగ్ అనిపించుకుంటూ ఉంటారు. తనతోటి నటీనటులకు కష్టం వస్తే అండగా నిలబడటంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా బాలీవుడ్, మరాఠీ చిత్రాల వెర్సటైల్ యాక్టర్ శ్రేయస్ తల్పాడే తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన రోజులను గుర్తుచేసుకుంటూ కింగ్ ఖాన్ గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రముఖ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ యూట్యూబ్ ఛానెల్లో శ్రేయస్ తల్పాడే మాట్లాడుతూ.. తను ముంబైలో మొదటి సొంత ఇల్లు కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను బయటపెట్టారు.
కాపాడిన ‘ఓం శాంతి ఓం’
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి వచ్చాను. ‘ఇక్బాల్’ వంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ముంబైలో సొంత ఇల్లు కొనేంత ఆర్థిక స్థోమత అప్పట్లో నాకు లేదు. 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా, ఫరా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఓం శాంతి ఓం’ లో నేను ఒక కీలక పాత్ర (షారుఖ్ జిగ్రీ దోస్త్) పోషించాను. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ముంబైలో ఒక ఇల్లు చూసుకుని, హోమ్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లాను. అయితే అప్పటికి నాకు ఫిక్డ్స్ సాలరీ లేదనే కారణంతో బ్యాంక్ అధికారులు హోమ్ లోన్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆ టైంలో బ్యాంక్ మేనేజర్ ఒక ఆప్షన్ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం మీరు ఏ సినిమా చేస్తున్నారు? ఆ సినిమా హీరో, డైరెక్టర్ ఎవరు? అని అడిగారు. దానికి నేను స్పందిస్తూ.. తాను షారుఖ్ ఖాన్ హీరోగా, ఫరా ఖాన్ డైరెక్షన్లో ‘ఓం శాంతి ఓం’ చేస్తున్నట్లు చెప్పాను. దాంతో, “వారితో ఒక అఫీషియల్ రికమండేషన్ లెటర్ ఇప్పిస్తే లోన్ క్లియర్ చేస్తాం” అని బ్యాంక్ ఆఫీసర్ కండిషన్ పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు.
Also Read
ఒకే రోజులో లోన్ శాంక్షన్
బ్యాంక్ అధికారుల మాట వినగానే నేను వెంటనే డైరెక్టర్ ఫరా ఖాన్‌కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాను. ఫరా ఖాన్ ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని షారుఖ్ ఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. శ్రేయస్ ఇబ్బందిని తెలుసుకున్న కింగ్ ఖాన్.. కేవలం రెండు రోజుల్లోనే స్వయంగా బ్యాంకుకు ఒక రికమండేషన్ లెటర్ రాసి ఇచ్చారు. ఆ లెటర్ అందిన కొన్ని గంటల్లోనే, అదే రోజు సాయంత్రానికి శ్రేయస్ తల్పాడే హోమ్ లోన్ క్లియర్ అయిపోయింది. అలా షారుఖ్ ఖాన్ ఇచ్చిన లెటర్ వల్లే తన సొంతింటి కల నెరవేరిందని ఈ ఇంటర్వ్యూలో శ్రేయస్ ఎమోషనల్ అయ్యారు. శ్రేయస్ మాటలు విన్న ఫరా ఖాన్ సరదాగా స్పందిస్తూ.. “నాకు ఈ విషయం అస్సలు గుర్తులేదు శ్రేయస్. కానీ నీ సొంతింటి కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. బహుశా అప్పట్లో ‘ఓం శాంతి ఓం’ సినిమాకి మేము నీకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటాం.. అందుకే షారుఖ్ అలా హెల్ప్ చేసి ఉంటాడు” అంటూ నవ్వేశారు. ప్రస్తుతం శ్రేయస్ తల్పాడే చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజావార్తలు
-
Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
-
IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
-
Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
-
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ తొలగింపు.?
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!