Tollywood : ఒక్క ఫ్లాప్‌తో మనసు మార్చుకుంటున్న హీరో, దర్శకనిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్క సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా హీరోలు, దర్శకనిర్మాతల కెరీర్ ట్రాక్‌ను పూర్తిగా మార్చేస్తుంది. ఈ మధ్య టాలీవుడ్, కోలీవుడ్ లోనూ ఇదే ట్రెండ్ బలంగా కనిపిస్తోంది. హిట్ కొట్టినప్పుడు కొత్త ప్రాజెక్టులు వరస కట్టుతుంటాయి. కానీ ఒక్క ఫ్లాప్ పడగానే ఆఫర్స్ వెనక్కి వెళ్లిపోతాయి, ఇప్పటికే ప్లాన్ చేసిన సినిమాలు హోల్డ్‌లో పడిపోతాయి. ఎన్టీఆర్ వరుస విజయాల తరువాత వార్2లో బిజీ అయ్యాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా మారడంతో, తారక్ తన పూర్తి దృష్టిని దేవర2పై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఒక్క ఫ్లాప్ తన కెరీర్‌ను తాకకుండా జాగ్రత్తపడుతున్నాడు.
Also Read : Kantara Chapter 1: బాప్రే.. 7 వేల స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ రిలీజ్!
Also Read
- Deepika Padukone: 'రాకా'.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
- Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
విజయ్ దేవరకొండ ‘లైగర్’ బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, అతని తదుపరి భారీ ప్రాజెక్ట్ జనగణమణ నిలిచిపోయింది. ఒక ఫ్లాప్ వల్ల ఎంతటి పెద్ద ప్రాజెక్ట్ కూడా నిలిచిపోతుందో దీనితో స్పష్టమవుతుంది. తాజాగా ‘తమ్ముడు’ ఫ్లాప్‌తో దాని తరువాత ప్లాన్ చేసిన ఎల్లమ్మ సినిమాను మేకర్స్ పక్కన పెట్టేశారు. లోకేశ్ కనగరాజ్ సినిమాలు ఎప్పుడూ స్టైలిష్‌గా, కమర్షియల్‌గా ఉంటాయి. ఆయన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చాలా కాలంగా ఖైదీ2పై ప్లాన్ చేస్తున్నప్పటికీ, పెద్ద స్టార్స్ నుంచి ఆఫర్స్ రావడంతో ఆ ప్రాజెక్ట్‌ను లైట్‌గా తీసుకున్నాడు. కూలీ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో, అమీర్ ఖాన్‌తో ప్లాన్ చేసిన సినిమా, కమల్-రజనీకాంత్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లు కూడా క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఇప్పుడు తిరిగి ఖైదీ2పై దృష్టిపెట్టే అవకాశం ఉందని టాక్.
Also Read :MP: కూలీ పని చేసి భార్యను పోలీసుని చేసిన భర్త.. ఎఫైర్ పెట్టుకుని భర్తనే బెదిరించిన మహాతల్లి
హిట్ పడితే కన్నూమిన్నూ తెలియని పరిస్థితి. ఒక్క ఫ్లాప్ పడగానే ఆకాశంలో విహరిస్తున్నవాళ్లు భూమ్మీదకు వస్తారు. ఫామ్‌లో ఉన్నప్పుడు వెనకపడినవాళ్లను పట్టించుకోరు. కానీ ఎదురు దెబ్బ తగలగానే అసలు విషయం బోధపడుతుంది. ఇది కేవలం లోకేశ్ కనగరాజ్ విషయంలోనే కాదు, తారక్ లాంటి స్టార్ హీరోల విషయంలోనూ జరుగుతోంది. మొత్తానికి, హిట్లు – ఫ్లాపులు హీరోల కెరీర్‌ను మలుపు తిప్పే ప్రధాన అంశాలు అనేది మళ్లీ మరోసారి రుజువైంది.
తాజావార్తలు
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!