హైదరాబాద్‌లోని మణికొండలో ప్రముఖ నటి హిమజ ‘గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్’ ఫ్రాంఛైజీని ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ మరియు నాణ్యమైన మేకోవర్ సేవలను మణికొండ వాసులకు ఈ సెలూన్ అందించనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ క్రమంలో నటి హిమజ మాట్లాడుతూ, “గ్రీన్ ట్రెండ్స్ గురించి చెప్పనవసరం లేదు. భారతదేశం నలుమూలలా దీని బ్రాంచీలు విజయవంతంగా నడుస్తున్నాయి. నీటి నుంచి నిప్పు వరకు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఈ రోజుల్లో, గ్రీన్ ట్రెండ్స్ ఉత్తమ ఎంపిక. ఇక్కడ నా మేకోవర్ చేసుకున్న తర్వాత నన్ను నేనే నమ్మలేనంత అందంగా తయారయ్యాను. మీరు కూడా ఇక్కడ మీకు నచ్చిన స్టైల్‌లో మేకోవర్ చేసుకోవచ్చు. యమున, విజయ్ గారు గ్రీన్ ట్రెండ్స్‌ను ఎంచుకోవడంలోనే విజయం సాధించారు. ఈ ఫ్రాంఛైజీ వారికి మరింత విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను,” అన్నారు.