Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో కార్మిక సంఘాల రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ & డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర సంచలనం రేగింది. ఫిలిం ఫెడరేషన్ నేతృత్వంలో జోరుగా సాగుతున్న ఎన్నికల హడావుడికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. వివాదాస్పదంగా మారిన ఈ ఎన్నికల ప్రక్రియపై న్యాయస్థానం స్టే ఆర్డర్ (CRP No. 3123/26) జారీ చేయడంతో చిత్రపురి వర్గాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను ఎలాగైనా పూర్తి చేయాలని భావించినప్పటికీ, అంతర్గత విభేదాలు, అభ్యంతరాల నడుమ వ్యవహారం కోర్టు మెట్లెక్కినట్లు సమాచారం. హైకోర్టు తాజా ఆదేశాలతో మొత్తం పోలింగ్ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది.
ఈ పరిణామంపై స్పందించిన అసోసియేషన్ ప్రతినిధులు, కోర్టు ఉత్తర్వులను గౌరవిస్తూ ఎన్నికలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ఫెడరేషన్‌కు అధికారికంగా లేఖ రాశారు. త్వరలోనే కోర్టు పూర్తి ఆర్డర్ కాపీని ఫెడరేషన్‌కు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైన అభ్యర్థులకు, డాన్సర్స్ యూనియన్ను తమ గుప్పిట్లో ఉంచుకోవాలని చూసిన పెద్దలకు ఈ స్టే ఆర్డర్ మింగుడుపడని పరిణామంగా మారింది. కోర్టు తదుపరి విచారణలో ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? అసోసియేషన్ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!