హీరో శ్రీరామ్ నటిస్తున్న కొత్త సినిమా “కోడి బుర్ర”. అల్లుకున్న కథ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్నారు. శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కోడి బుర్ర సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తున్నారు. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మూవీ టీమ్ చెబుతున్నారు. త్వరలోనే “కోడి బుర్ర” చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read : Viswam : సినిమా చూసేటప్పుడు మీకు నవ్వు ఆగదు: గోపిచంద్
ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – “కోడి బుర్ర” సినిమాలో హీరోగా నటిస్తుండటం సంతోషంగా ఉంది. ప్రస్తుతం మా మూవీ క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు. చాలా ఫాస్ట్ గా మూవీ షూటింగ్ చేస్తున్నాం. మా మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కథలో ఎన్నో మలుపులు ఉంటాయి. వాటిని ఇప్పుడే రివీల్ చేస్తే మీకు థ్రిల్ పోతుంది. అందుకే థియేటర్ లోనే “కోడి బుర్ర” సినిమాను చూడండి. ఈ రోజు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వచ్చే మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. “కోడి బుర్ర” సినిమా కథ మీ చుట్టూ జరుగుతున్నట్లే ఉంటుంది. చాలా రియలిస్టిక్ మూవీ ఇది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నాకు ఈ మూవీ చేసే ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నా’ అని అన్నారు.