మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.
Also Read : Prabhas : ‘రాజా సాబ్’ నైజాం థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాతలు చేతికి..
గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. గోపి మోహన్ గారు లక్ష్యం, లౌక్యం సినిమాలకి పని చేశారు. విశ్వం కూడా సేమ్ రేంజ్ ఆఫ్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కి సారీ చెప్పాలి( నవ్వుతూ) ఎందుకంటే యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తున్నప్పుడు నాకు నవ్వు వచ్చేసింది. ప్రతి సీన్ చేసేటప్పుడు సెట్ లో నవ్వుకుంటూనే ఉన్నాం. డైరెక్టర్ శ్రీను గారితో ఎప్పటినుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఫంక్షన్ లో కలిసాం. అప్పటినుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆయన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. తన సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆయన స్క్రిప్ట్ మీద దాదాపు 7 నెలలు పని చేశారు. ఆయన సీన్ చెప్పినప్పుడే చాలా అద్భుతంగా పెర్ఫాం చేస్తారు. ఆయన మార్క్ ప్రతి ఆర్టిస్ట్ లో కనిపిస్తుంది. అక్టోబర్ 11న దసరాకి సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి నవ్వు ఆగదు. యాక్షన్, కామెడీ, ఫన్ ఎక్స్ ట్రార్డినరీగా వచ్చింది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక మాట చెప్పగలను. శ్రీనువైట్ల గారు ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్. థాంక్ యూ సో మచ్’ అని అన్నారు
HiT Kodutunam
:- #GopiChand #Viswam pic.twitter.com/rxZ9DLjHFp
— Milagro Movies (@MilagroMovies) October 7, 2024