మలయాళ ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నటనతోనే కాకుండా డాన్స్ తోను సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ మలయాళ భామ. 2024 జనవరిలో పూజ కన్నన్ ప్రియుడు వినీత్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత గురువారం పూజ కన్నన్, వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. సాయి పల్లవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అన్ని తానై చెల్లి పెళ్లి ఘనంగా జరిపించింది సాయి పల్లవి.
Also Read : Devara : ఓవర్సీస్ లో ‘దేవర’ రికార్డులే రికార్డులు.. దేవర ముంగిట నువ్వెంత..
తాజగా ఈ పెళ్లి వీడియోలు బయటకు వచ్చాయి. ఈ పెళ్లి వేడుకలో చెల్లి పూజా కన్నన్‌తో కలిసి సాయి పల్లవి డ్యాన్స్ చేసింది. మరాఠీ సాంగ్ అప్సర అలీ పాటకు,క్వీన్ సీనిమాలోని లండన్ తుమక్డా సాంగ్ కు వీళ్లిద్దరు చేసిన డ్యాన్స్ లు ఓ రేంజ్ లో చేశారనే చెప్పాలి. ఇక పూజకన్నన్ విషయానికి వస్తే సాయి పల్లవి లాగే హీరోయిన్ గా ఎదగాలని చిత్ర సీమలో అడుగుపెట్టింది. మొదటి సినిమాగా తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వంలో zee5 నిర్మించిన చితిరై సెవ్వానం చిత్రంలో నటించింది. తెలుగులో అనగనగా ఓక మంగళవారం గా వచ్చింది. కానీ ఆ తర్వాత అమ్మడికి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, అక్కా చెల్లెలి డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పనిలో పనిగా ఇవిగో ఇక్కడ ఉన్నాయి చూసేయండి.
Here's the Full Video of Our Sai Pallavi & Pooja dancing for APSARA AALI 🥹💃🏻❤️🔥 @Sai_Pallavi92 #SaiPallavi #SaiPallaviSisterWedding pic.twitter.com/bSULacchIx
— Saipallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) September 8, 2024