ఫ్లాపుల్లో కూడా వరుస ఆఫర్లు కొల్లగొడుతున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు శ్రీలీల అండ్ రాశిఖన్నా. ప్రస్తుతం ఈ ఇద్దరు తలో హ్యాట్రిక్ ప్లాపులు నమోదు చేశారు. శ్రీలీల ఈ ఏడాది రాబిన్ హుడ్ , జూనియర్, మాస్ జాతరతో డిజాస్టర్లను చూస్తే రాశీ ఖన్నా నటించిన అగస్త్యా, తెలుసు కదా బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్మామెన్స్ చేశాయి. అంతకు ముందు రిలీజైన హిందీ ఫిల్మ్ ది సబర్మతి రిపోర్ట్ కూడా ఫ్లాపే.
Also Read : NBK 111 : రాజ్యంలోకి అడుగుపెట్టిన యువరాణి.. యుద్ధానికి ముహూర్తం ఫిక్స్
టాలీవుడ్ స్టార్ సోయగం రాశీ ఖన్నా లాస్ట్ ఇయర్ వచ్చిన ఆరణ్మనై4 తర్వాత హిట్ ఎలా ఉంటుందో మర్చిపోయింది. కానీ మేడమ్ ఆఫర్లకు వచ్చిన కొదవ లేదు. త్రీ ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. నవంబర్ 21న రిలీజయ్యే 120 బహుదూర్‌తో హిట్ కొట్టి హిందీ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్న రాశీ. బాలీవుడ్‌లో మరో రెండు ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌లో శ్లోకగా కనిపించబోతున్న ఈ ఢిలీ డాల్. తాజాగా తమిళంలో సిద్దార్థ్ సరసన రౌడీ అండ్ కోకు కమిటయ్యింది. ఓ వైపు హీరోయిన్ గా మరోవైపు ఐటమ్ గర్ల్ గా తన స్టఫ్ ఇచ్చేస్తున్న శ్రీలీల బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమైంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నా సక్సెస్ దోబూచులాడుతోంది. ఫ్లాప్స్ పలకరిస్తున్నా మేడమ్ పట్ల క్రేజ్ ఆగడం లేదు. బాలీవుడ్, కోలీవుడ్ కూడా పాకింది. అక్కడ నుండి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. పరాశక్తితో పాటు శివకార్తీకేయన్‌తో మరో సినిమాకు కమిటైనట్లు టాక్. హిందీలో అనురాగ్ బసు ప్రాజెక్ట్ కాకుండా రెండు మూడు కథలు వింటుందని సమాచారం. ఇక తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ ఉండనే ఉంది. ఇలా ఈ ఇద్దరు భామలు సక్సెస్ అనే ట్రాక్ సరిగ్గా లేకపోయినా దండిగా ఆఫర్లను మాత్రం కొల్లగొడుతున్నారు.