Harsha Sai : హర్ష సాయి కేసులో నిజానిజాలు.. పూసగుచ్చినట్టుగా..
- హర్ష సాయి కేసులో కీలక మలుపు
- ప్రస్తుతం పరారీలో ఉన్న హర్ష సాయి
- నమ్మించి మోసం చేశాడన్న బదితురాలి తరపు లాయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్ష సాయి కేసులో అసలేం జరిగింది అనే దానిపై హర్ష సాయి బాధితురాలి లాయర్ నాగూర్ బాబు Ntv తో మాట్లాతూ వాస్తవాలు బయటపెట్టారు. బాధితురాలు హర్ష సాయి హీరోగా నిర్మిస్తున్న ‘మెగా’ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. 2022 లో ఒక సాంగ్ కోసం బాధితురాలు తొలిసారి హర్ష సాయిని కలిశారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉంది. తన వద్ద ఒక స్టోరీ ఉంది అని హర్ష బాధితురాలికి చెప్పాడు. తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మబలికాడు. అలా బాధితురాలు మెగా అనే మూవీ స్టార్ట్ చేసింది. ఆమె సొంత డబ్బులతో మెగా సినిమాను ప్రొడ్యూస్ చేసింది.
తనకు హైదరాబాదులో ఉండడానికి షల్టర్ లేదని, చెప్పడంతో బాధితురాలు హర్ష సాయి కోసం ఒక విల్లాను అరేంజ్ చేసి ఇచ్చింది. స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాలి అని బాధితురాలిని హర్ష సాయి కోరగ, అతని మాటలు నమ్మి బాధితురాలు హర్ష సాయి ఉండే విల్లాకు వెళ్ళినప్పుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి, ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెపై లైంగీకదాడికి పాల్పడ్డాడు, అంతేకాకుండా ఆ తతంగాన్ని వీడియో రికార్డ్ చేసి, మరుసటి రోజు ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేశాడు. ఇలాంటివి చేయడం నాకు ఫాంటసీ, ఇలాంటివి నా వద్ద చాలా ఉన్నాయని చెప్పాడు.
Also Read
తాను లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు హర్ష వాళ్ళ నాన్న రాధాకృష్ణ ఎంటరయ్యాడు. మీడియాకు వెళ్తే ఇద్దరి ఫేం నాశనం అవుతాయని సర్ది చెప్పాడు. తర్వాత హర్షసాయి నాన్న మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు, దీంతో బాధితురాలు నమ్మింది, దీంతో కేస్ ఫైల్ చేయకుండా గతంలో విత్ డ్రా చేసుకుంది, 2023లో మెగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయింది. ట్రైలర్ సక్సెస్ కావడంతో హర్ష సాయికి దురాశ పుట్టింది. ఆమెతో ఉన్న సినిమా కాపీరైట్స్ దక్కించుకోవడానికి వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు.
టీజర్ రిలీజ్ కి ముందే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అప్పటినుండి బాధితురాలు పెళ్లి గురించి ప్రస్తావన తీసుకొస్తుంది. ఆమె చేసిన పర్సనల్ కాల్స్ ఎడిట్ చేసి హర్షకు అనుకూలంగా మార్చుకొని అవి చూపించి ఆమెను బెదిరించాడు. బాధితురాలిని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తూ, సినిమా కాపీ రైట్స్ ఇస్తేనే తాను మిగతా షూటింగ్ లో పాల్గొంటానని, లేకపోతే వీడియోలను రిలీజ్ చేస్తానని బెదిరించాడు. హర్ష సాయి పెట్టె వేధింపులు తట్టుకోలేక చివరకు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. బెదిరింపులకు సంబంధించిన అన్ని ఆడియో, వీడియో ఎవిడెన్స్ లు కోర్టుకు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కోర్టులో హర్షసాయికి ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న నమ్మకం ఉంది” అని తెలిపారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!