Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Gopal Varma: దిగ్గజ నటుడు నానా పటేకర్ హఠాన్మరణంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నానా పటేకర్ ఇకలేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అన్నారు. నానా పటేకర్ మరణం తర్వాత ఆర్జీవీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. నానా పటేకర్ బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటన గురించి ప్రస్తావించారు. అంత బలమైన వ్యక్తి ఇంత అకస్మాత్తుగా దూరమవుతారని అస్సలు ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్‌లో నానా పటేకర్ ను “యాక్టింగ్ గాడ్” అని వర్ణించిన వర్మ.. ఆయన గుండె ఆగిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదని రాసుకొచ్చారు. “ఈ లోకంలో ఎవరూ అమరులు కారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అంతటి ధృడమైన మనిషికి ఇంత హఠాత్తుగా ఇలా జరుగుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయనను మోసం చేసిన ఆ గుండెను నేను అసహ్యించుకుంటున్నాను. నటనా దేవుడైన నానా పటేకర్‌ను బలితీసుకున్న ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది” అంటూ వర్మ భావోద్వేగానికి లోనయ్యారు.
రామ్ గోపాల్ వర్మ, నానా పటేకర్ కాంబినేషన్లో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. వీరి ప్రయాణం 2003లో వచ్చిన ‘భూత్’ చిత్రంతో ప్రారంభమైంది. అందులో నానా పటేకర్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆర్జీవీ నిర్మించిన ‘డర్నా మనా హై’లో కూడా ఆయన నటించారు. ఇక 2004లో వచ్చిన క్రైమ్ డ్రామా ‘అబ్ తక్ ఛప్పన్’ వీరిద్దరి కాంబినేషన్లోనే అతిపెద్ద హిట్ కాగా, అందులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సాధు అగాషే పాత్రలో నానా పటేకర్ జీవించేశారు. దశాబ్దం తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి 2013లో ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ సినిమా చేశారు. అందులో ఆయన జాయింట్ పోలీస్ కమిషనర్ రాకేష్ పాత్రను అద్భుతంగా పోషించారు.
Also Read
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
ఇదిలా ఉండగా.. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటు రావడంతో గురువారం తెల్లవారు జామున నానా పటేకర్ కన్నుమూసిన విషయం విధితమే. వెంటనే ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు బతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం హెడ్ డాక్టర్ శేఖర్ సాల్కర్ అధికారికంగా ధృవీకరించారు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో నానా పటేకర్ తనకు ఆరోగ్యం బాగులేదని ఒక స్నేహితుడికి మెసేజ్ చేశారని, ఆ స్నేహితుడు తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ఇంటికి చేరుకున్నారని డాక్టర్ సాల్కర్ తెలిపారు. ఇక, హింది, మరాఠీ చిత్రసీమలో నానా పటేకర్ చెరగని ముద్ర వేశారు. 1978లో ‘గమన్’ సినిమాతో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన.. పరిందా, ప్రహార్, అంగార్, క్రాంతివీర్, తిరంగా, ఖామోషి, అబ్ తక్ ఛప్పన్ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల కాలంలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ‘హౌస్‌ఫుల్ 5’, విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ‘ఓ రోమియో’లలో కనిపించగా, అనిల్ కపూర్, రాధికా మదన్ నటించిన ‘సుబేదార్’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు.
YES, everybody knows nobody is immortal .. But I still can’t believe this can so suddenly happen to a man , as strong as him .. I hate his heart for failing him and I feel like killing GOD for killing the GOD of acting , NANA PATEKAR .
— Ram Gopal Varma (@RGVzoomin) October 8, 2026
Goodbye Nana, can’t ever forget what you brought to Ab Tak Chappan , Bhoot and the Attacks of 26/11 🙏🙏🙏 https://t.co/PImStMteVO
— Ram Gopal Varma (@RGVzoomin) October 8, 2026
తాజావార్తలు
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!