Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో మొదలైన హరిహర వీరమల్లు ఎట్టకేలకు ప్రీమియర్‌ల ద్వారా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా అనేకసార్లు వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో క్రిష్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో నిర్మాత రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమా పూర్తి చేశారు.
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఎవరది ఎవరది’ అనే మాస్ అండ్ మిస్టీరియస్ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ సాంగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ శైలిలో సాగుతుంది. ఓ రహస్య మయమైన, పోరాటమే జీవితం అయిన నాయకుడి కథను చెబుతూ సాగే ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరపరిచిన మ్యూజిక్,…