Gudipudi Srihari: సీనియర్ పాత్రికేయుని కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (86) 4వ తేదీ రాత్రి రెండు గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మి గత యేడాది నవంబర్ లో మరణించారు. వారికి ఓ అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన శ్రీహరి గతవారం ఇంటిలో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. వెంటనే నిమ్స్ లో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఇతర అనారోగ్య సమస్యతో సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కుమారుడు శ్రీరామ్ స్వదేశానికి రాగానే గుడిపూడి శ్రీహరి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
55 సంవత్సరాల పాత్రికేయ ప్రస్థానం
గుడిపూడి శ్రీహరి 1968లో ‘ది హిందు’కు కంట్రిబ్యూటర్ గా పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈనాడు దిన పత్రికకూ తన సేవలు అందించారు. హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలోనూ న్యూస్ బ్రాడ్ కాస్టర్ గా పనిచేశారు. ప్రముఖ గాయకులు, ‘సుందరకాండ’ ఎమ్మెస్ రామారావును ఆల్ ఇండియా రేడియో ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి గుడిపూడి శ్రీహరి గారికే దక్కుతుంది. అలానే 125 సంవత్సరాల సురభి నాటక సమాజం గురించి ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రపంచానికి తెలియచేసిన తర్వాత ఢిల్లీలోని సంగీత నాటక అకాడమి, ఆ సంస్థను గుర్తించి తన సహాయ సహకారాలను అందించింది. ఇరవై యేళ్ళ పాటు ఆల్ ఇండియా రేడియోకు సేవలు అందించిన గుడిపూడి శ్రీహరి ఈనాడు దిన పత్రికలో ‘హరివిల్లు’ పేరుతో 25 సంవత్సరాల పాటు శీర్షికను నిర్వహించారు.
Also Read
- Varanasi Update: ఇదొక అప్డేటే.. అసలైన బ్లాస్ట్ కోసం వేచి చూడాల్సిందే!
- Dhanush-Mammootty: మమ్ముట్టి సర్.. మరోసారి ఇలా రాకండి ప్లీజ్.. ధనుష్ కామెంట్స్ వైరల్!
- Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్‌పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
‘సితార’ సినిమా వార పత్రికకు చిత్ర సమీక్షలు దశాబ్దాల పాటు రాశారు. తెలుగు సినిమా చిత్ర సమీక్షకు గుడిపూడి శ్రీహరి ఓ లాండ్ మార్క్ గా నిలిచారు. ఆయన సమీక్షలు గీటురాయిగా నిలిచేవంటే అతిశయోక్తి కాదు. అలానే అనేక సంవత్సరాల పాటు ది హిందు దిన పత్రిక ‘ఫ్రైడే పేజీ’, ‘సండే మేగజైన్’ సెక్షన్ కు విరివిగా వ్యాసాలు రాశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించడంతో పాటు తన తోటి సీనియర్ పాత్రికేయులతో కలిసి, బషీర్ బాగ్ లోని జర్నలిస్ట్ అసోసియేషన్ (దేశోద్ధారకభవన్) నిర్మాణానికి ఇతోధిక సేవ చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్ర, తెలుగు సినిమా రంగంపై ఆయన పుస్తకాలు రాశారు. ఎన్.ఎఫ్.డి.సి. స్క్రిప్ట్ కమిటీ సభ్యులుగా సేవలు అందించారు. గుడిపూడి శ్రీహరి మరణంతో ఓ పాత్రికేయ దిగ్గజాన్ని తెలుగు ప్రతికారంగం కోల్పోయినట్టు అయ్యింది. ఆయన మృతికి పలు జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయులు తీవ్ర సంతాపం తెలిపారు.
తాజావార్తలు
-
Lakshya Raichandani: ఆ ఐపీఎల్ టీమ్‌లో ఆడడమే నా టార్గెట్.. మనసులో మాట చెప్పేసిన అండర్-19 కెప్టెన్!
-
Cyclone Akwan: దూసుకొస్తున్న అక్వాన్ తుఫాన్.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
Windfall Tax Hike: కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్ ఎగుమతులపై పన్ను లీటరుకు రూ.14కు పెంపు.. పెట్రోల్‌పై జీరో డ్యూటీ!
-
IPL 2027-MS Dhoni: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడతాడా?.. ఏడాది ఉత్కంఠకు తెర!
ట్రెండింగ్
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!