సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (86) 4వ తేదీ రాత్రి రెండు గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మి గత యేడాది నవంబర్ లో మరణించారు. వారికి ఓ అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన శ్రీహరి గతవారం ఇంటిలో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. వెంటనే నిమ్స్ లో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఇతర అనారోగ్య సమస్యతో సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కుమారుడు శ్రీరామ్…