shocking : విడాకులు తీసుకున్న మరొక స్టార్ కపుల్.. కారణం ఏంటంటే..?
- విడాకులు తీసుకున్న స్టార్ కపుల్
- 16 ఏళ్ళ వైవాహిక బంధానికి ముగింపు
- అధికారకంగా ప్రకటించిన జయం రవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరొక స్టార్ కపుల్ విడాకులు తీసుకున్నారు. ఇటీవల తమిళ నటుడు ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకుని ఎవరి దారిలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. తాగాజా కోలీవుడ్ స్టార్ట్ హీరో జయం రవి, సతీమణి ఆర్తి విడాకులు తీసుకున్నారు. ఎప్పటినుండో వీరి విడాకులపై రూమర్స్ వస్తుండగా నేడు అధికారకంగా ఓ లేఖ విడుదల చేశాడు జయం రవి. ఆ లేఖలో ” జీవితం అనేది వివిధ అధ్యాయాలతో కూడిన ప్రయాణం, నా సినీ ప్రయాణంలో నా అభిమానులు నాకు ఎంతో మద్దతు ఇచ్చారు, ఇప్పుడు నా జీవితంలోని ఒక ముఖ్యమైన విషయాన్ని వారితో పంచుకోవాలి.
Also Raed : Thalapathy Vijay : దర్శకుడిగా తమిళ విజయ్ కొడుకు.. హీరోగా మన తెలుగు కుర్రాడే..
Also Read
అనేక సమాలోచనలు మరియు చర్చల తర్వాత, ఆర్తితో నా వివాహాన్ని రద్దు చేసుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాను.ఈ నిర్ణయం తొందరపాటుతో తీసుకోలేదు. ఈ క్లిష్ట సమయంలో మా గోప్యతతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను మరియు ఈ విషయంలో ఎలాంటి ఊహలు, పుకార్లు లేదా ఆరోపణలు చేయడం మానుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా మీరు నాపై కురిపించిన ప్రేమకు నేను కృతజ్ఞుడను” అని రాసుకొచ్చారు. 16 ఏళ్ల రవి, ఆర్తి వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. టిక్ టిక్ టిక్ సినిమాలోని కన్నయ్య సాంగ్ లో ఉన్నది జయం రవి కొడుకే. రేపు అనగా సెప్టెంబరు 10న జయం రవి పుట్టిన రోజు కావడం కొసమెరుపు. ఈ హీరో నటించిన బ్రదర్ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!