కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీన ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ టాక్ కు తగ్గట్టే కలెక్షన్స్ కూడా రాబట్టింది. వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 250 కోట్లు కలెక్ట్ చేసింది.
థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇటీవల ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఈ నెల 8 నుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోను సంచనాలు నమోదు చేస్తోంది. వారం క్రిందట ఓటీటీలో అడుగు పెట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ గడచిన వారం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ లో టాప్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ సంచలనం నమోదు చేసింది. అజిత్ కుమార్ మాస్ సంభవానికి ఫిదా అవుతున్నారు ఆడియెన్స. అటు థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ కాగా ఇప్పుడు ఓటీటీ లోను సూపర్ హిట్ గా నిలవడంతో అటు ఫ్యాన్స్ తో పాటు నిర్మాతలు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు.