Godse Movie Trailer: మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నోడే సర్పంచ్ కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘గాడ్సే’ . ‘బ్లఫ్ మాస్టర్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు.
‘గాడ్సే’ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘సత్యమేవ జయతే అంటారు.. ‘ధర్మో రక్షితి రక్షత: అంటారు. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు’అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. హీరో సత్యదేవ్ ను పట్టుకోవడం కోసం బ్లాక్ కమాండోలు ప్రయత్నించడం.. అతడిని షూట్ చేయడం వంటివి చూపించారు. ప్రభుత్వ పథకాలు, అవినీతీపై ప్రశ్నించే పాత్రను సత్యదేవ్ పోషించినట్టు అర్థం అవుతోంది.
Also Read
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్‌స్టార్ తెలుగులో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6’ స్ట్రీమింగ్!
- Mega 158: డాడీ కోసం పెద్ది!
‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?’ అని హీరో చెప్పే మాట రాష్ట్ర ప్రభుత్వాలకు సూటిగా తగులుతుందని చెప్పవచ్చు. ’90 శాతం ప్రజాప్రతినిధులు అఫిడివిట్ చేసి జ్యుడిషియల్ స్టాంప్ వేసుకున్న నామినేషన్ పత్రాలు.. అన్నీ అబద్ధాలే’ అని రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించారు. ‘ప్రశ్నిస్తే..మారణకాండ చేసేస్తారా?’ అనే మాట హీరోకి జరిగిన అన్యాయాన్ని తెలిపింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రమిదని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్‌లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నోడే సర్పంచ్ కావాలి’, అని సత్యదేవ్ చెప్పే డైలాగ్ రాజకీయ నాయకుల అర్హతను ప్రశ్నించేలా ఉంది. ‘సుజలాం సుఫలం మలయజ శీతలం’ లాంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ట్రైలర్ ఓరేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈనెల జూన్17న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఆమె పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ చేశారు. ‘నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తుండటం నా వల్ల కాదు సార్’ అని ఆమె చెప్పే డైలాగ్.. ఆ పాత్రలో హ్యుమానిటీని తెలియజేస్తోంది. ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: సురేష్ రగుతు, శాండీ అడ్డంకి సంగీతం సమకూర్చారు. జూన్ 17న సినిమా విడుదల ఈసినిమా కోసం ప్రేక్షకులు ఆశక్తి కరంగా ఎదురు చూస్తున్నారు. మరి గాడ్సే సినిమా అభిమానులను ఏవిధంగా ఆకట్టుకోనుందో జూన్ 17 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్‌ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్‌కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!