Site icon NTV Telugu

Gods and Soldiers : తమిళ సినీ పరిశ్రమలోకి రాజ్‌ తరుణ్‌

Gods

Gods

‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ మిల్టన్‌, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ తెలుగు నుండి తమిళంలోకి అడుగుపెట్టడం విశేషం. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ ఆయన మరింత దగ్గర కానున్నారు. రాజ్‌ తరుణ్‌తో పాటు, సునీల్‌, వేదన్‌, భారత్‌, అమ్ము అభిరామి, కిషోర్‌, జెఫ్రీరి, భరత్‌ శ్రీని, పాల డబ్బా, విజిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘రఫ్‌ నోట్‌ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది.

Also Read:Vedavyas: సౌత్ కొరియా హీరోయిన్, మంగోలియా విలన్ తో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా

‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌’ టైటిల్‌ టీజర్‌ను ప్రముఖ నటులైన విజయ్‌ సేతుపతి, విజయ్‌ ఆంటోని, ఆర్య, మరియు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తమ ఎక్స్ అకౌంట్‌ల ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ మాట్లాడుతూ, “‘గోలీసోడా’లోని ‘రఫ్‌నెస్‌’ను, కొత్త కోణంలో ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ టైటిల్‌ టీజర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తప్పకుండా అందరి అంచనాలను అందుకుంటుందని నమ్ముతున్నాం. మా టీజర్‌ను షేర్ చేసి, మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు” అని తెలిపారు.

Exit mobile version