Gods and Soldiers : తమిళ సినీ పరిశ్రమలోకి రాజ్ తరుణ్
- 'గోలీసోడా' దర్శకుడు విజయ్ మిల్టన్ కొత్త చిత్రం 'గాడ్స్ అండ్ సోల్జర్'
- 'గాడ్స్ అండ్ సోల్జర్' టైటిల్ టీజర్ విడుదల.
- 'గాడ్స్ అండ్ సోల్జర్' చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి తెలుగు హీరో రాజ్ తరుణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గోలీసోడా’, ‘గోలీసోడా-2’ వంటి చిత్రాలతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ మిల్టన్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గోలీసోడా’ ఫ్రాంచైజీలోని ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రానికి ‘గాడ్స్ అండ్ సోల్జర్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తెలుగు నుండి తమిళంలోకి అడుగుపెట్టడం విశేషం. ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ ఆయన మరింత దగ్గర కానున్నారు. రాజ్ తరుణ్‌తో పాటు, సునీల్, వేదన్, భారత్, అమ్ము అభిరామి, కిషోర్, జెఫ్రీరి, భరత్ శ్రీని, పాల డబ్బా, విజిత వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘రఫ్ నోట్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతోంది.
Also Read:Vedavyas: సౌత్ కొరియా హీరోయిన్, మంగోలియా విలన్ తో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
‘గాడ్స్ అండ్ సోల్జర్’ టైటిల్ టీజర్‌ను ప్రముఖ నటులైన విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని, ఆర్య, మరియు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తమ ఎక్స్ అకౌంట్‌ల ద్వారా విడుదల చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. విడుదలైన కొద్దిసేపటికే ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ, “‘గోలీసోడా’లోని ‘రఫ్‌నెస్’ను, కొత్త కోణంలో ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ టైటిల్ టీజర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తప్పకుండా అందరి అంచనాలను అందుకుంటుందని నమ్ముతున్నాం. మా టీజర్‌ను షేర్ చేసి, మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు” అని తెలిపారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..