GOAT Vijay Remuneration Became Hot Topic: తలపతి విజయ్ సినిమా విడుదలయ్యే రోజే అభిమానులకు దీపావళి, పొంగల్ అలాగే అన్ని పండుగలు అన్నట్టు జరుగుపుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు ‘గోట్’ సినిమాలు విడుదలయ్యే థియేటర్లలో మాత్రం అభిమానుల సంబరాలు మామూలు కంటే తక్కువగా ఉన్నా జనాలు మాత్రం తగ్గకపోవడంతో తమిళనాడు థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. తమిళనాడులోని థియేటర్లలో అభిమానుల స్పెషల్ స్క్రీనింగ్ వేడుకలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి.. ప్రజల భద్రత కోసమే తమిళనాడు ప్రభుత్వం ఈ పని చేసినా.. ఉదయం 6, 7 గంటలకు తలపతి సినిమాలు చూసే అలవాటున్న అభిమానులను కాస్త కలవరపరిచింది.
బాబోయ్ డింపుల్ హయాతి.. ఆ అందాలు చూస్తే మతి పోవాల్సిందే!
ఇక తలపతి రాజకీయ నాయకుడు కూడా అయ్యాడు కాబట్టి… వేడుకల పేరుతో డబ్బులు వృధా చేయకుండా, ఆ డబ్బులు పేదవారికి కడుపునిండా తిండికి వినియోగించాలని, పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5000 పైగా థియేటర్లలో విడుదలైన ‘గోట్’ సినిమా అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. దళపతి సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ ని రీచ్ అవుతుందనే అంచనాలు తలెత్తాయి. 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల కంటే ముందు విజయ్ పాత్ర వల్లనే లాభాలను తెచ్చిపెట్టిందని నిర్మాత అర్చన కల్పతి మొన్న కామెంట్ చేశారు. అంతేకాదు ఈ సినిమా కోసం తలపతి విజయ్ దాదాపు 200 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది. ఆ బడ్జెట్ తో ఏకంగా 40 చిన్న సినిమాలు అంటే 5 కోట్ల సినిమాలు చేయచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.