Global Star Ram Charan attending IIFA UTSAVAM 2024 at YASI ISLAND: ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (International Indian Film Academy Awards) ను సంక్షిప్తంగా ఐఫా అంటారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో వీటిని కూడా కీలకంగా భాసిస్తారు. 2000లో ప్రారంభమైన ఈ అవార్డులు, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలలో నిర్వహిస్తూ వస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడంలో ఐఫా అవార్డులు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది 2024 ఐఫా అవార్డ్స్ అంగరంగ వైభవంగా అబుదాబిలోని యస్ ఐలాండ్ లో సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు జరగనున్న క్రమంలో ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు.
Rakul: ఆ ఫుడ్ ఆర్డర్ చేశాడని రకుల్ బ్రేకేప్.. పాపం ఎవరో తెలుసా?
ఈ వేడుకలో షాహిద్ కపూర్ తో సహా పలు సినీ ప్రముఖులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారని తెలుస్తోంది. ఇక మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 28న అవార్డ్స్ ప్రధానం జరుగనుండగా 29న ఐఫా రాక్స్ గాలాతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ సంవత్సరం తెలుగు సినిమాకు సంబదించి నాని నటించిన దసరా మరియు హాయ్ నాన్న సినిమాలు అత్యధిక నామినేషన్లు పొందాయనే సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ IIFA ఉత్సవంలో పాల్గొననున్నట్టు ఆయన పీఆర్ టీం వెల్లడించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సౌత్ స్టార్ సమంతా రూత్ ప్రభుని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) ఉత్సవం అవార్డ్స్‌లో ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.