రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటించిన సినిమా ఘాటీ. వేదం, గమ్యం చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కింది ఘాటీ. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ట్రైలర్ తో ఆడియెన్స్ లో కాస్త అంచనాలు పెంచిన ఈ సినిమా అనుష్క ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలుస్తుందని భావించారు.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
కానీ మొదటి రోజు ఓవర్సిస్ ప్రీమియర్ నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది ఘాటీ. ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని బుకింగ్స్ పై గట్టిగానే ప్రభావం చూపించింది. ఇక తెలుగు స్టేట్స్ లోను మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే ఘాటీ మొదటి రోజూ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఘాటి మొదటి రోజు కోటి రూపాయల కంటే తక్కువగానే షేర్ రాబట్టి షాకిచ్చింది. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే భారీ నష్టాలు తప్పవు. థియేట్రికల్ రైట్స్ ధరల పరంగా, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 20 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయాల్సి ఉంది. కానీ ట్రెండ్ ప్రకారం చూస్తే రూ. 5 కోట్ల షేర్ కూడా సాధించడం అసాధ్యం అనిపిస్తుందని ట్రేడ్ టాక్. వీకెండ్ లోని వసూళ్లు పుంజుకునే అవకాశం లేదని భావిస్తుంది. క్రిష్ రాసుకున్న రొటీన్ కథ, ఓల్డ్ స్టైల్ మేకింగ్ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చాయి. అనుష్క ఖాతాలో చాలా కాలం తర్వాత మరో ప్లాప్ సినిమా వచ్చి చేరింది.