Site icon NTV Telugu

Gautamy Chowdary: నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు.. ఇది తప్పుడు కేసు!

Dharma

Dharma

కొన్నాళ్ల క్రితం మొదలైన హీరో ధర్మ మహేష్, ఆయన భార్య గౌతమీ చౌదరి అక్రమ సంబంధాల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా గౌతమీ చౌదరి మీద భర్త మహేష్ కాకాని ఫిర్యాదు చేశారు. “తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ” ఆమెతో పాటు ఓ ప్రముఖ ఛానెల్‌లో పనిచేసే జర్నలిస్టు మీద కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే, తాజాగా ఈ విషయం మీద గౌతమి చౌదరి స్వయంగా స్పందించింది.

Also Read :Jatadhara : ‘జటాధర’లో ధన పిశాచి సీక్వెన్స్‌ పై ప్రేరణ అరోరా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

“నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. కేవలం నన్ను, నా క్యారెక్టర్‌ని దిగజార్చడం కోసం మా భర్త, ఒక అడ్వకేట్ కలిసి ఫేక్ కేసు నమోదు చేశారు. కావాలనుకుంటే ఎవరైనా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ కేసు కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. నా మీద నమోదు చేయబడిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నా క్యారెక్టర్‌ని దిగజార్చడం కోసం మీరు ఎంత ప్రయత్నాలు చేసినా, నేను న్యాయపోరాటం చేసి గెలుస్తాను. ఇందులో నా భర్త, సదరు లాయర్, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులతో కూడా మీటింగ్స్ నిర్వహించి నామీద ఎలా దుష్ప్రచారం చేయాలో ప్లాన్ చేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను వారందరి మీద కేసులు పెడతాను, లీగల్‌గా పోరాడతాను” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Exit mobile version