ప్రతిష్టాత్మకమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ నాలుగు ఎడిషన్లు దుబాయిలో అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా 2025 – 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనున్నట్టు ప్రకటించారు. దుబాయ్ లో జరిగిన Keinfra Properties ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5th ఎడిషన్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను శనివారం లాంఛ్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు అద్భుతమైన ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రఘు కుంచె సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది.
Also Read:Trisha: మరోసారి రచ్చ రేపిన త్రిష?
ఈ సంగీత ప్రదర్శనను యూఏఈ లోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్ తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు.
Also Read:Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు. ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారని ప్రకటించారు.