మిస్టర్ బచ్చన్‌తో నడుమ అందాలు ప్రదర్శించి ఓవర్ నైట్ క్రష్‌గా మారి, ఆఫర్లను క్యాచ్ చేయడంలో కిస్సిక్ బ్యూటీనే మించిపోతుంది భాగ్యశ్రీ. ఫస్ట్ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా కూడా ప్రజెంట్ చేతిలో మూడు సినిమాలు. వినిపిస్తున్నవి మరో మూడు ఉన్నాయి. ఎంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు. ఎందుకంటే హిట్స్ లేకున్నా కూడా వరుస ఛాన్సులు కొల్లగొట్టడం అంత ఈజీ కాదు.
Also Read : Naga Vamsi : విజయ్ దేవరకొండను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు
బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూరైనా స్టార్ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. ఇప్పటికే కింగ్డమ్, కాంత, ఆంధ్రా కింగ్ తాలూకాతో పాటు లెనిన్, అట్లీ మూవీ కోసం ఈమె పేరునే పరిశీలిస్తున్నారన్నది టాక్. అయితే ఇప్పడు మరొక భారీ ప్రాజెక్ట్ లో కూడా భాగ్యశ్రీ పేరు వినిపిస్తోంది. అదే ప్యారడైజ్. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన దసరా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే కాంబోలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నారట. దాదాపు ఓకే అయినట్టు సమాచారం. ఒక్క హిట్టు సినిమా కూడా లేకుండానే భాగ్య శ్రీ భారీ బడ్జెట్ చిత్రాల్లో ఛాన్స్ లు కొడుతుంది. ఈ నార్ట్ బ్యూటీ నటించిన భారీ చిత్రం కింగ్డమ్ ఈ నెల 31న థియేటర్స్ లో అడుగుపెడుతుంది. ఈ సినిమాతో అయినా అమ్మడి ఖాతాలో ఒక హిట్ పడితే కెరీర్ కు ఇంకా ప్లస్ అవుతుంది. లేదా శృతి హాసన్, పూజా హెగ్డే మాదిరి ఇరన్ లెగ్ అనే ట్యాగ్ ఇచ్చేస్తారు.