మంచు మనోజ్ కెరీర్ స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి అనే మాస్ & రియలిస్టిక్ టచ్ ఉన్న కథలో హీరోగా రాబోతున్నాడు. రీసెంట్ గా యాక్షన్ డ్రామా భైరవం తో తన యాక్షన్ ఇమేజ్ ని రీక్యాప్చర్ చేశాడు. నారా రోహిత్, బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. విజయ్ కనక మేడల తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాక పోయినా మంచు మనోజ్ రీ ఎంట్రీ కి తగ్గ పవర్ ఫుల్ క్యారెక్టర్ భైరవం లో దొరికింది.
Also Read : Sensational Combo : కమల్ హాసన్.. రజనీకాంత్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరంటే
మనోజ్ నెక్ట్స్ సినిమాల లైనప్ చూస్తే ‘రక్షక్ — యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న సినిమా. మిలిటరీ షేడ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కలిపిన ఈ కథలో మనోజ్ పాత్ర ఇంటెన్స్ యాక్షన్ తో కనిపించబోతోంది. మిరాయ్ — ఇది ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామా. 2డి , ౩డి ఫార్మాట్ లో సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది మిరాయ్. ఇక అహం బ్రహ్మస్మి — మనోజ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్. 2020 లోనే అనౌన్స్ చేసినా ఇంకా రిలీజ్ కాలేదు. పవర్‌ఫుల్ డైలాగ్స్, హై ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ లిస్ట్ లో ఉంది. మరోవైపు What The Fish మాత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్, కామెడీ, సస్పెన్స్ కలిపిన యువతరానికి అట్ట్రాక్టివ్ ఫిల్మ్ గా వస్తోంది. ఇలా మొత్తం డేవిడ్ రెడ్డి, భైరవం, మిరాయ్, రక్షక్, అహం బ్రహ్మస్మి, వాట్ ద ఫిష్ — ఆరు సినిమాలతో వరసగా స్క్రీన్ పైకి రానున్నాడు మంచు మనోజ్. అంత గ్యాప్ తర్వాత ఇంత స్పీడ్ తో రావడం మంచి పరిణామం అయితే ఆయన కెరీర్ కి కొత్త టర్న్ ఏ సినిమా తీసుకొస్తుందో చూడాలి.