మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాగల్’. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా సిమ్రాన్ చౌదరి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ యూత్ ఫుల్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఈ సింగిల్ చిన్నోడే’ లిరికల్ వీడియో సాంగ్ ను స్పెషల్ గా సింగిల్స్ కోసమే అంటూ విడుదల చేశారు. కరోనా కష్ట సమయంలో ఈ బ్రాండ్ న్యూస్ సాంగ్ తో అందరినీ చిల్ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు మేకర్స్. బెన్నీ దయాల్ ఆలపించిన ఈ సాంగ్ కు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మీరు కూడా ‘ఈ సింగిల్ చిన్నోడే” లిరికల్ సాంగ్ పై ఓ లుక్కేయండి మరి.