జంగిల్ రమ్మి అనే బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేసిన కారణంగా పది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ కి నోటీసులు ఇచ్చింది ఈడి. నోటీసులు వచ్చిన నేపధ్యంలో తన అడ్వకేట్ తో పాటు ఈడి ముందు ముందు విచారణ హాజరయ్యాడు ప్రకాష్ రాజ్. ప్రమోషన్ కు మూడు నెలల ముందు అలాగే ప్రమోట్ చేసిన తరువాత ఆరు నెలల వరకు బ్యాంక్ స్టేట్‌మెంట్ లను వెంట తీసుకొని వచ్చాడు ప్రకాష్ రాజ్. బ్యాంక్ అకౌంట్ స్టేట్ మెంట్ లను ఈడీ అధికారులకు అందజేసిన ప్రకాశ్ రాజ్..విచారణ గదిలోకి అడ్వకేట్ ను అనుమతించని ఈడీ అధికరులు
Also Read : Samantha : ఆగిపోయిన ‘సమంత’ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతోంది
దాదాపు మూడు గంటలుగా నటుడు ప్రకాష్ రాజ్ ను విచారిస్తోంది ఈడీ. జంగిల్ రమ్మీ ద్వారా భారీగా లాభపడినట్లు గుర్తించిన ఈడీ. దుబాయ్ కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుండి ట్రాన్సాక్షన్ జరిగినట్లు గుర్తించారు. దుబాయ్ నుండి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేశాడు ప్రకాష్ రాజ్. ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును దుబాయ్ లోనే పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తోంది ఈడీ. అందుకోసం 5 సంవత్సరాల ఆర్థిక లావాదేవీలను చెక్ చేస్తోంది.మరోవైపు ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తోంది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై క్లారిటీ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. తాను గతంలో జంగిల్ రమ్మీకి ప్రమోషన్ చేసిన మాట వాస్తవమే కానీ వారితో కాంట్రాక్టు పూర్తి అయ్యాక మళ్ళీ రెన్యూవల్ చేయలేదు. మళ్ళీ ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పాడు ప్రకాష్ రాజ్. ఈ విచారణ సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.