ఒక టాలీవుడ్ హీరో ఈమధ్య తన డూప్ అదేనండి బాడీ డబుల్ తో ఎదుర్కొన్న ఒక ఎన్కౌంటర్ సరికొత్త చర్చకు దారి తీసింది. అసలు విషయం ఏమిటంటే ఆయన తెలుగులో ఒక స్టార్ హీరో. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు చేశాడు. కొన్ని హిట్లు ఉన్నాయి కొన్ని ఫ్లాపులు ఉన్నాయి. ఆయనకు ఇద్దరు బాడీ డబుల్స్ ఉండేవారు. ఒకరు షేప్ అవుట్ అవడంతో ప్రస్తుతానికి ఒకరు మాత్రమే పని చేస్తున్నారు. మామూలుగా సదరు హీరో సినిమా షూటింగ్ కి లేటుగా వెళుతూ ఉంటాడు. ఈలోపు ఫేస్ కనపడకుండా తీయాల్సిన షాట్స్ ఏమైనా ఉంటే సదరు బాడీ డబుల్ తో షూట్ చేసుకుంటూ ఉంటారు దర్శకులు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా షూటింగ్ కి హీరో వెళ్లిన చాలా సేపటికి గాని సదరు బాడీ డబుల్ రాలేదు. ఇదేంట్రా నాయనా నేను వచ్చి ఇంతసేపు అవుతుంది నువ్వు ఇంకా రాకపోవడం ఏంటి అని హీరో సదరు బాడీ డబుల్ మీద ఫైర్ అవడానికి వెళ్తే మీరు ఏమి అననంటే ఒక మాట చెప్తాను. మీరు హీరోగా నటిస్తున్న మరో సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్ కోసం నన్ను దర్శకుడు పిలిస్తే వెళ్లి వచ్చానని చెప్పాడట.
Marco: మోస్ట్ వయలెంట్ ఫిలింకి సెన్సార్ షాక్
దీంతో హీరో షాక్ అయ్యాడు. అంటే సదరు దర్శకుడు తనకు చెప్పకుండానే ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తున్నాడని ఆలోచన రావడం షాక్ కలిసించింది. ఇది ఒక హీరో కథ. మరో హీరో ఏమో తన బాడీ డబుల్ తోనే 10 కోట్ల రూపాయల విలువ చేసే ఒక ఫైట్ కంపోజ్ చేయించాడు. అంతా అయిపోయిన తర్వాత అబ్బే ఇదేమి బాలేదు ఇప్పుడు నేనే చేస్తాను అని రంగంలోకి దిగాడట. నిజానికి ఈ బాడీ డబుల్స్ వాడటం కొంతవరకు హీరోలకు మంచిదే కానీ అసలు హీరోలకు దర్శకులు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా బాడీ డబుల్స్ వాడేయడం మాత్రం కాస్త ఇబ్బందికర పరిణామమే అని చెప్పాలి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హీరోలకు ఇబ్బంది కలిగే విషయంగా మారినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పటినుంచి ఈ విషయం మీద కాస్త కేర్ తీసుకుంటే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు