విభిన్న సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయింది.
Also Read : Daayra : పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన కరీనా కపూర్
కాగా ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ అందుకుంది. దుల్కర్ నటన, వెంకీ అట్లూరి దర్శకత్వం ఆడియెన్స్ ను అలరించింది. బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా తోలి రోజు రూ. 12.7 కోట్లు కొల్లగొట్టింది. రెండవ రోజు రూ. 14 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇక మూడవ మొదటి వీకెండ్ శనివారం రూ. 13.7 కోట్లు కలెక్ట్ చేసింది. నాలుగవ రోజు రూ. 15.5 కోట్లు, ఇక ఐదవ రోజు వర్కింగ్ డే నాడు సోమవారం అటుఇటుగా రూ. 6 కోట్లు కలెక్ట్ చేసింది. అటు దుల్కర్ సల్మాన్ సొంత స్టేట్ కేరళలో లక్కీ భాస్కర్ రూ. 10. 1 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా రన్ అవుతోంది. లాంగ్ రన్ లో లక్కీ భాస్కర్ రూ. 100 కోట్ల మార్కెట్ ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.