డాషింగ్ హీరో, మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లోనూ భారీగా అభిమానులు ఉన్నారు. “మహానటి”తో తెలుగువారి మనసును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ యంగ్ హీరో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నటిస్తూ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. తనదైన శైలి నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తన నటనా ప్రతిభతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. తాజాగా ఈ హీరో “కొచ్చి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మాన్-2020″గా, “చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మాన్-2020” లిస్ట్ లో రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకా ఇండియాలోని మోస్ట్ డిజైరబుల్ మెన్-2020 జాబితాలో 5వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు.