DSP: మరోసారి వార్తల్లోకి దేవిశ్రీ ప్రసాద్.. పుష్పనే టార్గెట్ చేశాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ఉన్నది ఉన్నట్లు బయటకు మాట్లాడే వ్యక్తుల్లో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఒకరు. తన వర్క్ గురించి, లేదా సినిమాకి సంబంధించిన ఏదైనా విషయంలో. దర్శక నిర్మాతలు మాట్లాడిన మాటలు నచ్చకపోతే.. సినిమా వేదికపైనే వారికి నిరభ్యంతరంగా సమాధానమిస్తాడు. అలాంటి దేవిశ్రీప్రసాద్ తాజాగా రెమ్యూనరేషన్ గురించి చేసిన హాట్ టాపిక్ గా మారాయి. జూన్ 20న విడుదలైన ‘కుబేర’ మూవీ మంచి కలెక్షన్లు సాధించగా, ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్ లో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో దేవిశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read : Jana Nayagan : ఇదేంట్రా.. విజయ్ చివరి సినిమా అన్నారు కదా..!
Also Read
DSP మాట్లాడుతూ.. ‘కుబేర నిర్మాత సునీల్ నారంగ్ గారు నా రెమ్యూనరేషన్ పూర్తిగా సినిమా విడుదలకు ముందే క్లియర్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. టైం కి పేమెంట్ కూడా వచ్చేసింది. మ్యూజిక్ బాగుందని పొగిడారు కూడా. అంతకంటే ఇంకేం కావాలి?’ అని ఆనందం వ్యక్తం చేశారు. అంతలోనే యాంకర్ ‘సునీల్ గారు సక్సెస్ మీట్‌లో మాట్లాడతానన్నారు. మీరు మాట్లాడించాలి’ అనగా, DSP వెంటనే స్పందిస్తూ..
‘పేమెంట్ ఇస్తానని బాకీ పెట్టడం కంటే, మాట్లాడతానని బాకీ పెట్టడం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ఇక ఈ మాటలు వినగానే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. పేమెంట్ బాకీ పెట్టిన వారు ఎవరు? ఆయన మాటలు పరోక్షంగా మైత్రి మూవీ మేకర్స్ గురించా? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ‘పుష్ప 2’ సమయంలో దేవిశ్రీ–మైత్రి మధ్య కొంత దూరం ఏర్పడినట్లు టాక్ వినిపించింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు DSP చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్–సుకుమార్ టీమ్‌కి సంకేతంగా అనిపిస్తున్నాయి. అయితే, ఆయన స్పష్టంగా ఎవరి పేరు చెప్పలేదు. కానీ టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఈ కామెంట్స్ ఊపందుకున్నాయి.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!