ఈ దీపావళికి తెలుగు సహా తమిళ, కన్నడ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం నటించిన కా సినిమాకి మంచి టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమాకి కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ వస్తున్నాయి. వీటితో పాటు తమిళంలో తెరకెక్కి తెలుగులోకి డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయిన అమరన్ సినిమాకి కూడా మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ప్రశాంత్ నీల్ బావమరిది శ్రీమురళి హీరోగా నటించిన భగీర మాత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. సినిమా టెంప్లేట్ బాగా అలవాటైపోయిన విధంగా ఉండడం, మిగతా మూడు సినిమాలతో పోలిస్తే అంత ఎట్రాక్టివ్ గా లేకపోవడంతో ఈ సినిమాకి అంతగా కలెక్షన్స్ రావడం లేదు.
Naga Chaitanya – Sobhita: పెళ్లి ఎక్కడో తెలిసిపోయింది!
అయితే ఈ అన్ని సినిమాల విషయంలో ఒక వ్యక్తికి మాత్రం డబుల్ బొనాంజా దొరికినట్లు అయింది. ఆయన ఇంకెవరో కాదు ఏ ఆర్ రెహమాన్ మేనల్లుడు, తమిళంలో ఇప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా నటుడిగా దూసుకుపోతున్న జీవి ప్రకాష్ కుమార్. ఆయన లక్కీ భాస్కర్ సినిమాకి సంగీతం అందించాడు. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలతో ఆకట్టుకున్నాడు. మరొకపక్క శివ కార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ సినిమాకి కూడా ఆయనే సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాలు ఒకటి తమిళంలో ఒకటి తెలుగు మలయాళ భాషల్లో సూపర్ హిట్లుగా నిలిచి రికార్డు కలెక్షన్లు దిశగా పరిగెడుతున్నాయి. దీంతో ఈసారి ఈ దీపావళికి జీవి ప్రకాష్ కుమార్ కి డబుల్ బొనాంజా దక్కినట్టు అయింది.