ఫాహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ప్రారంభం: అర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంయుక్త నిర్మాణం. ‘ప్రేమలు’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి భారీ విజయాన్ని సాధించి, అభిరుచి గల నిర్మాతగా ఎస్ఎస్ కార్తికేయ (షోయింగ్ బిజినెస్) మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా, భారతదేశం గర్వించదగ్గ చిత్రమైన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ (Don’t Trouble The Trouble) తో నిర్మాణంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
Also Read : Devara Part 2 : ‘దేవర 2’ కథలో భారీ ట్విస్ట్ – నార్త్ ఆడియన్స్ కోసం స్పెషల్ ప్లాన్!
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అనే థ్రిల్లింగ్ ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీతో నూతన దర్శకుడు శశాంక్ యేలేటి తెరపై తన సత్తాను చాటుకోబోతున్నారు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ క్రేజీ ప్రాజెక్ట్, కంటెంట్‌తో కూడిన చిత్రాన్ని నిర్మించడానికి ఎస్ఎస్ కార్తికేయతో చేతులు కలిపారు. ఆదివారం (అక్టోబర్ 19) ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈరోజే ఫాహద్ ఫాజిల్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఫాహద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్, నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ సెట్ లో ఉన్న స్టిల్స్‌ను షేర్ చేసి ఈ సినిమాకి సంబంధించిన ప్రకటనను అధికారికంగా వెల్లడించారు.
ఈ ఫస్ట్ షెడ్యూల్ నవంబర్ 8 వరకు కొనసాగుతుందని, ఇందులోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నామనీ మేకర్స్ తెలిపారు. ఈ మూవీని 2026 ద్వితీయార్థంలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ నుంచి గతంలో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టర్లో మంత్రదండం, పిల్లాడు, ఫాహద్ లుక్ చూస్తుంటే ఫాంటసీ ఎంటర్టైనర్గా అందర్నీ ఆకట్టుకోనున్నట్టుగా అనిపిస్తుంది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.