యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర: పార్ట్ 1” సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. థియేటర్లలో హిట్ అవడమే కాకుండా, ఓటీటీలో కూడా ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రౌడీ లుక్‌లో, మాస్ యాక్షన్‌తో ఎన్టీఆర్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి “దేవర పార్ట్ 2” పైనే ఉంది.
Also Read : Bollywood : మేము కలిసి నటిస్తే మమ్మల్ని భరించలేరు –షారుక్, సల్మాన్, ఆమిర్ సంచలన వ్యాఖ్యలు!
ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. డిసెంబర్‌లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు కొరటాల శివ ఈ సీక్వెల్ కథలో పలు ముఖ్యమైన మార్పులు చేశారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ఆడియన్స్‌ను కూడా బాగా కనెక్ట్ చేసేలా కంటెంట్ డిజైన్ చేస్తున్నారని ఫిలింనగర్ టాక్. తెలిసిన వివరాల ప్రకారం, ఈసారి కథలో రాజకీయ యాక్షన్ డ్రామా తో పాటు భావోద్వేగానికి కూడా పెద్ద స్థానం కల్పించారు. దీంతో “దేవర 2”లో కొత్త యాంగిల్‌గా ఎన్టీఆర్ పాత్రకు మరింత పవర్‌ఫుల్ బ్యాక్‌స్టోరీ ఇవ్వాలని నిర్ణయించారట. అలాగే, సీక్వెల్‌లో మరో ప్రముఖ బాలీవుడ్ హీరోను తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఆ హీరోతో ఎన్టీఆర్ మధ్య కొన్ని సన్నివేశాలు ఉంటాయట. ఇక హీరోయిన్ విషయంలో కూడా చిన్న ట్విస్ట్ ఉందట. “దేవర 1”లో లవ్ ట్రాక్‌లో జాన్వీ కపూర్ కనువిందు చేసింది. కానీ “దేవర 2”లో కథ మలుపు తిరుగుతుందని, అందులో మరో హీరోయిన్ కీలక పాత్రలో కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ కొత్త హీరోయిన్ ఎవరన్నది కూడా ఇంకా సస్పెన్స్‌గానే ఉంచారు.
సైఫ్ అలీ ఖాన్ ఈ ఫ్రాంచైజ్‌లో విలన్‌గా తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇప్పుడు రెండో పార్ట్‌లో ఆయన పాత్రకు మరింత డెప్త్ ఇవ్వనున్నారట. అలాగే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి నటులు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో అయితే అనిరుధ్ రవిచందర్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నాడు. ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. మొత్తానికి “దేవర: పార్ట్ 2” పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి మాస్ ఫైర్ చూపిస్తుందో, ఈ సీక్వెల్ ఏ రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ అవుతుందో చూడాలి.