Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు స్పందించినట్టు, మరొక సినిమాకు రియాక్ట్ కాలేదు. రిలీజ్‌కి ఒకసారి, ఆ తర్వాత రివ్యూ పేరుతో మరొకసారి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఎంతలా సపోర్ట్‌గా నిలిచినా సినిమాను బతికించలేకపోయారా? ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్ చేసిన ప్రమోషన్ సినిమా ఓపెనింగ్స్ కూడా ఉపయోగపడలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినిమా బాగుంటే చాలు, పాజిటివ్ టాక్‌తో సినిమాను సూపర్ హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి డబ్బింగ్ అయిందో వాళ్లకు అనవసరం. హీరో, హీరోయిన్లు ఎవరో తెలియకపోయినా చూసేస్తారు. కానీ, సినిమా బాగోకపోతే మాత్రం ఎంతమంది సెలబ్రిటీస్ కట్టకట్టుకొని చూడమని చెప్పినా ఆడియన్స్ వినరు అనడానికి ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ఉదాహరణగా నిలిచింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఇది. దెయ్యాన్ని కిడ్నాప్ చేయడమే పాయింట్ కొత్తగా ఉన్నా, దాన్ని ఆకట్టుకునేలా తీయలేకపోయాడు దర్శకుడు శశాంక్ యేలేటి. ఈ మూవీతో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా మారాడు. సినిమాకు రాజమౌళి ప్రెజెంటర్‌గా వ్యవహరించాడు. దర్శక ధీరుడు ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. అప్పటివరకు ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని చాలా మందికి తెలియదు. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ఈవెంట్‌కు తారక్ ముఖ్య అతిథిగా రావటం, సినిమా ప్రమోషన్‌కు బాగా ఉపయోగపడింది.
అంతేకాదు, రిలీజ్‌కు ముందే మహేష్, ఎన్టీఆర్ ‘ఎక్స్’ (X) వేదికగా రివ్యూస్ ఇచ్చి సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆహా, ఓహో అంటూ సినిమాను లేపేశారు. ఇక ప్రీమియర్స్‌కు సుకుమార్, అనిల్ రావిపూడి, మహేష్ ఫ్యామిలీ రావడంతో ఈ విజువల్స్ సినిమాకు బూస్ట్ అప్ ఇచ్చాయి. మహేష్, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ రూపొందుతోంది. ఈ క్రమంలో ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ప్రమోషన్ బాధ్యతను తీసుకున్నాడు మహేష్. సూపర్ స్టారే కాదు, కూతురు సితార కూడా సినిమాలో నటించిన చిన్నారి సారాతో కలిసి ప్రమోషనల్ వీడియో చేసింది. సెలబ్రిటీస్ మూకుమ్మడి ప్రమోషన్స్ కంటే ముందే, అసలు ప్రచారం బాలకృష్ణ వాయిస్‌తో మొదలైంది. బాలయ్య డైలాగ్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ఫేమస్ కావడం, ఇదే టైటిల్‌తో సినిమా రావడంతో ట్రైలర్‌కు బాలకృష్ణ వాయిస్ ఓవర్‌ను ఉపయోగించుకున్నారు. ఇలా ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ ప్రమోషన్ కోసం సుదీర్ఘమైన రివ్యూలు ఇచ్చిన మహేష్, ఎన్టీఆర్, అనిల్ రావిపూడి ట్రబుల్లో పడ్డారు. వీళ్లు చెప్పినట్టు సినిమా లేకపోవడంతో వాళ్ల ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఒక్కసారి టాక్ బయటికి వచ్చాక ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. ఇంతమంది చెప్పినా ఓపెనింగ్స్ రాలేదు. రాజమౌళి గొప్ప దర్శకుడు, ఇండియా గర్వించదగ్గ దర్శకుడే! కానీ, ఆయన నిర్మించిన సినిమాను నిలబెట్టడానికి ఇంత భజన అవసరమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!