Yash: నా మనసుకు బాధ కలిగించవద్దు: ఫ్యాన్స్‌కి యశ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు జనవరి 8. అయితే ఆ రోజున తన పుట్టినరోజు జరుపుకోనని ఆయన ఒక పోస్ట్ చేశారు. ఈ సారి కూడా తన పుట్టినరోజు జరుపుకోనని యష్ తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేశారు. అలాగే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అభిమానులు అందరూ ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని యష్ లెటర్‌లో పేర్కొన్నారు. ఇలాంటి వేడుకల్లో పాల్గొనటం కంటే అభిమానులు వారి గొప్ప లక్ష్యాలను చేరుకుంటున్నారని తెలిసి ఎంతో ఆనందపడతానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. యష్ తన అభిమానులను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో ప్రేమను వ్యక్త పరిచే విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను ఆయన గుర్తు చేసుకున్నారు.
Sankranthiki Vasthunam: వెంకీ మామ తగ్గట్లేదు.. మరో సాంగ్ వదిలాడు!
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
- The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
ఈ ఏడాది ప్రారంభంలో యష్ పుట్టినరోజు సందర్భంగా.. కర్ణాటకలో గదగ్ జిల్లాలో ముగ్గురు అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో యష్ ప్రమాదంలో చనిపోయిన అభిమానుల కుటుంబాలను ప్రత్యేకంగా వెళ్లి కలిసి నివాళులు అర్పించటమే కాకుండా, ఆ కుటుంబాలకు మద్దతుగా ఉంటామని తెలియజేశారు. ఈ ఘటన తర్వాత తనకు బ్యానర్స్‌ను కట్టటం, ప్రమాదకరమైన బైక్ ర్యాలీలలో పాల్గొనటం, నిర్లక్ష్యపు సెల్ఫీలు తీసుకోవటం మానుకోవాలని యష్ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు చేయటమనేవి.. నిజమైన అభిమానాన్ని చూపినట్లు కాదని ఆయన పేర్కొన్నారు. ‘మీరు నా నిజమైన అభిమాని అయితే మీ పనిని మీరు శ్రద్ధగా చేయండి, మీ జీవితం మీదే, సంతోషంగా ఉండండి, విజయవంతంగా ముందుకెళ్లండి’ అని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు యష్ రిక్వెస్ట్ చేశారు.
2019లో ఓ అభిమాని యష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలవాలనుకుని, కలవలేకపోయారు. దీంతో సదరు అభిమాని ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆ సందర్భంలోనూ ఇలాంటి చర్యలు సరైనవి కావని అభిమానులకు యష్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తన పుట్టినరోజు రానున్న సందర్భంగా ఈసారి యష్, తన అభిమానుల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. వారు సురక్షితంగా ఉండటమే తనకు లభించిన గొప్ప బహుమతి అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. యష్ ప్రస్తుతం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్’ సినిమా చేస్తున్నారు. ఈ భారీ ప్రతిష్టాత్మకమైన ఎంటర్‌టైనర్‌ను కె.వి.ఎన్.ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె.నారాయణ, యష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!